Explore

Search

November 7, 2026 6:21 pm

“నవీపేటలో హైడ్రామా.. మద్యం మత్తులో సెల్ టవర్ ఎక్కి వెంకట్ వీరంగం!”

చంటి ఛానల్,నవీపేట: మండల కేంద్రంలో బుధవారం ఒక వ్యక్తి సెల్ టవర్ ఎక్కి నానా హంగామా సృష్టించాడు. మద్యం మత్తులో ఉన్న వెంకట్ అనే వ్యక్తి ఒక్కసారిగా సెల్ టవర్ పైకి చేరుకోవడంతో స్థానికులు భయాందోళనకు గురయ్యారు. దాదాపు రెండు గంటల పాటు టవర్ పైనే ఉండి హల్చల్ చేయడంతో కింద ఉన్న జనం ఊపిరి బిగబట్టి చూశారు. సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే ఘటనా స్థలానికి చేరుకుని, అతడిని కిందకు దిగాలని కోరారు. చివరకు పోలీసులు గట్టిగా మందలించడంతో వెంకట్ మెల్లగా టవర్ దిగి కిందకు వచ్చాడు. దీంతో పెను ప్రమాదం తప్పడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

ప్రకటన
ప్రత్యక్ష క్రికెట్ స్కోర్