చంటి ఛానల్,బోధన్: నిజామాబాద్ జిల్లా బోధన్ మండలంలో సభ్య సమాజం తలదించుకునే ఘటన వెలుగుచూసింది. మానసిక స్థితి సరిగా లేని ఓ యువతిని (23) ఆసరాగా చేసుకున్న ఆటో డ్రైవర్ ఇంతియాజ్ (40), ఆమెపై అఘాయిత్యానికి ఒడిగట్టాడు. సోమవారం సాయంత్రం యువతి ఒంటరిగా ఉండటం గమనించిన నిందితుడు, ఆమెను తన ఆటోలో ఎక్కించుకుని ఊరి శివారులోని నిర్మానుష్య ప్రాంతానికి తరలించాడు. గమనించిన స్థానికులు వెంటనే అప్రమత్తమై నిందితుడిని పట్టుకుని దేహశుద్ధి చేసి పోలీసులకు అప్పగించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసిన బోధన్ రూరల్ పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. కాగా, నిందితుడిపై కఠిన చర్యలు తీసుకోవాలని దివ్యాంగుల హక్కుల పోరాట సమితి డిమాండ్ చేస్తోంది.

