Explore

Search

November 7, 2026 6:21 pm

కేసీఆర్ జన్మదినం సందర్భంగా ఆసుపత్రిలో పండ్ల పంపిణీ

చంటి ఛానల్, బోధన్:  తెలంగాణ రాష్ట్ర సాధకులు, బీఆర్ఎస్ అధినేత కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు జన్మదిన వేడుకలను పురస్కరించుకుని ఈరోజు ఉదయం బోధన్ జిల్లా ప్రభుత్వ ఆసుపత్రిలో రోగులకు పండ్లను పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ కౌన్సిలర్లు అశోక్ రెడ్డి, లక్ష్మి, నాయకులు బెంజర్ గంగారాం మాట్లాడుతూ.. తెలంగాణ రథసారధి కేసీఆర్ ఆయురారోగ్యాలతో నిండు నూరేళ్లు వర్ధిల్లాలని ఆకాంక్షించారు. తెలంగాణ రాష్ట్రానికి కేసీఆరే శ్రీరామరక్ష అని వారు కొనియాడారు. ఈ సేవా కార్యక్రమంలో నాయకులు నాగుల రవిశంకర్ గౌడ్, శంకర్ గౌడ్, నరేష్, హరిశంకర్, బోదు శంకర్, శివ, కన్ను గౌడ్, సాగర్, జకీర్, రవి, సాయిలు, ఇతర బీఆర్ఎస్ కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

ప్రకటన
ప్రత్యక్ష క్రికెట్ స్కోర్