చంటి ఛానల్,నిజామాబాద్: సెక్యూరిటీ కౌన్సిల్ ఆధ్వర్యంలో శనివారం బోధన్‌లోని రమాకాంత్ ఫంక్షన్ హాల్‌లో యువతకు డ్రగ్స్, సైబర్ సెక్యూరిటీ, మహిళల భద్రతపై భారీ అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన నిజామాబాద్ పోలీస్ కమిషనర్ పి. సాయి చైతన్య, ఐపీఎస్ మాట్లాడుతూ.. సరదాగా మొదలయ్యే డ్రగ్స్ అలవాటు విద్యార్థుల భవిష్యత్తును, కుటుంబాలను చిన్నాభిన్నం చేస్తుందని హెచ్చరించారు. పవర్ పాయింట్ ప్రెసెంటేషన్ ద్వారా మాదకద్రవ్యాల వల్ల కలిగే మానసిక, శారీరక మరియు ఆర్థిక నష్టాలను వివరించిన ఆయన, ప్రతి విద్యార్థి లక్ష్యం వైపు పయనించాలని, చెడు అలవాట్లకు దూరంగా ఉండాలని సూచించారు. “డ్రగ్ ఫ్రీ తెలంగాణ” సాధనలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని, అనుమానాస్పద సమాచారం ఉంటే టోల్ ఫ్రీ నంబర్ 1098కు ఫిర్యాదు చేయాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో సెక్యూరిటీ కౌన్సిల్ సభ్యులు కవితా రెడ్డి, కేతం సంతోష్‌లతో పాటు బోధన్ ఏసీపీ శ్రీనివాస్, స్థానిక సీఐలు, ఎస్ఐలు, సుమారు 1500 మంది కాలేజీ విద్యార్థులు పాల్గొన్నారు.

