చంటి ఛానల్,బోధన్: పట్టణంలోని కొన్ని వార్డులలో ప్రస్తుతం ‘లోకల్ – నాన్ లోకల్’ వివాదం రాజకీయ సెగలు పుట్టిస్తోంది. ఎన్నికల సమీపిస్తున్న వేళ, వార్డుకు చెందని అభ్యర్థులు ఇక్కడ పోటీ చేయడాన్ని స్థానిక ప్రజలు తీవ్రంగా వ్యతిరేకిస్తుండటంతో అభ్యర్థులు తీవ్ర సతమతమవుతున్నారు. తమ మధ్యే ఉంటూ సమస్యలు తీర్చే వారికే ఓటు వేస్తామన్న భావన ఓటర్లలో బలంగా కనిపిస్తుండటంతో, బయటి ప్రాంతాల నుండి వచ్చిన నాయకుల గెలుపు అవకాశాలపై నీలినీడలు కమ్ముకున్నాయి. ఈ ‘స్థానిక’ సెంటిమెంట్ ఎన్నికల ఫలితాలను ఏ మేరకు ప్రభావితం చేస్తుందోనని రాజకీయ వర్గాల్లో ఆసక్తికర చర్చ సాగుతోంది.

