చంటి ఛానల్,బోధన్: నిజామాబాద్ – బోధన్ మధ్య ప్రయాణించే వాహనదారులకు ముఖ్య గమనిక. బోధన్ – నిజామాబాద్ హైవేలోని మోస్రా-బెల్లాల్ రోడ్డును కలిపే రైల్వే లెవల్ క్రాసింగ్ (LC No. 17JB)ను ఫిబ్రవరి 3 (మంగళవారం) నుండి శాశ్వతంగా మూసివేస్తున్నట్లు రైల్వే అధికారులు ప్రకటించారు. ఈ ప్రాంతంలో ట్రాఫిక్ ఇబ్బందులను తొలగించేందుకు రైల్వే శాఖ మరియు నిజామాబాద్ జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు నూతనంగా ‘రోడ్ అండర్ బ్రిడ్జ్’ (RUB) నిర్మాణ పనులను చేపట్టనున్నారు. ఈ పనుల నిమిత్తం జంక్షన్ వద్ద రైల్వే గేటును శాశ్వతంగా మూసివేస్తున్నామని, ప్రజలు మరియు వాహనదారులు ప్రత్యామ్నాయ మార్గాలను ఎంచుకుని అధికారులకు సహకరించాలని సీనియర్ సెక్షన్ ఇంజనీర్ (బ్రిడ్జెస్) రవి ప్రకాష్ ఒక ప్రకటనలో కోరారు. ఈ విషయంపై ఇప్పటికే బోధన్ ఎంఆర్ఓ, మున్సిపల్ కమిషనర్మ, పోలీసులకు సమాచారం అందించినట్లు లేఖలో పేర్కొన్నారు.

