Explore

Search

November 7, 2026 6:44 pm

విధి నిర్వహణలో అమరత్వం.. కానిస్టేబుల్ సౌమ్య మృతి పట్ల సుదర్శన్ రెడ్డి సంతాపం.

చంటి ఛానల్,నిజామాబాద్‌: గంజాయి స్మగ్లర్ల దాడిలో తీవ్రంగా గాయపడి చికిత్స పొందుతున్న ఎక్సైజ్ కానిస్టేబుల్ సౌమ్య మృతి చెందడం పట్ల ప్రభుత్వ సలహాదారు పి.సుదర్శన్ రెడ్డి తీవ్ర సంతాపం వ్యక్తం చేశారు. సౌమ్య ప్రాణాలు కాపాడేందుకు ప్రభుత్వం శతవిధాలా ప్రయత్నించినప్పటికీ, ఫలితం లేకపోవడం దురదృష్టకరమని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. మత్తు పదార్థాల రవాణాను అరికట్టే విషయంలో ప్రభుత్వం రాజీ పడబోదని, ఈ ఘటనకు బాధ్యులైన వారిపై ఉక్కుపాదం మోపుతూ కఠిన చర్యలు తీసుకుంటామని ఆయన హెచ్చరించారు. విధి నిర్వహణలో ప్రాణాలర్పించిన సౌమ్య కుటుంబానికి ప్రభుత్వం అన్ని విధాలుగా అండగా ఉంటుందని ఈ సందర్భంగా సుదర్శన్ రెడ్డి హామీ ఇచ్చారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

ప్రకటన
ప్రత్యక్ష క్రికెట్ స్కోర్