Explore

Search

November 7, 2026 7:08 pm

మున్సిపల్ ఎన్నికల బిగ్ అప్‌డేట్: ప్రధాన పార్టీల నామినేషన్ల వెల్లువ!

చంటి ఛానల్,బోధన్: మున్సిపల్ ఎన్నికల నగారా మోగడంతో రాజకీయ సెగలు మొదలయ్యాయి. నామినేషన్ల రెండో రోజైన గురువారం నాటికే ఏకంగా 72 నామినేషన్లు దాఖలు కావడంతో మున్సిపాలిటీలో ఎన్నికల వాతావరణం అప్పుడే వేడెక్కింది. మొత్తం 38 వార్డులకు గాను 70 మంది అభ్యర్థులు బరిలో నిలవగా, ప్రధాన పార్టీల మధ్య పోటీ రసవత్తరంగా మారింది. ముఖ్యంగా కాంగ్రెస్ 30 నామినేషన్లతో దూసుకుపోతుండగా, బిఆర్ఎస్ 20, బిజెపి 12, ఎంఐఎం 9 నామినేషన్లతో తమ పట్టు నిలుపుకునేందుకు సిద్ధమయ్యాయి. ఆమ్ ఆద్మీ పార్టీ కూడా ఒక నామినేషన్ వేసి తన ఉనికిని చాటుకుంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

ప్రకటన
ప్రత్యక్ష క్రికెట్ స్కోర్