Explore

Search

November 7, 2026 7:08 pm

కాంగ్రెస్‌లో చేరిన టీడీపీ సీనియర్ కార్యకర్త వేములపల్లి శ్రీరామ్మూర్తి

చంటి ఛానల్,బోధన్: తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం చేపడుతున్న అభివృద్ధి కార్యక్రమాలకు ఆకర్షితులై తెలుగుదేశం పార్టీ సీనియర్ కార్యకర్త వేములపల్లి శ్రీరామ్మూర్తి సోమవారం (జనవరి 26, 2026) కాంగ్రెస్ పార్టీలో చేరారు. నిజామాబాద్‌లోని బోధన్ ఎమ్మెల్యే, ప్రభుత్వ సలహాదారు సుదర్శన్ రెడ్డి నివాసంలో జరిగిన ఈ కార్యక్రమంలో, శ్రీరామ్మూర్తి తన అనుచరులతో కలిసి ఎమ్మెల్యే సమక్షంలో కాంగ్రెస్ కండువా కప్పుకున్నారు. ఈ సందర్భంగా సుదర్శన్ రెడ్డి, జిల్లా సీనియర్ నాయకులు వారికి సాదర స్వాగతం పలికారు. రానున్న బోధన్ మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఘనవిజయం సాధించడానికి తన శాయశక్తులా కృషి చేస్తానని ఈ సందర్భంగా శ్రీరామ్మూర్తి ధీమా వ్యక్తం చేశారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

ప్రకటన
ప్రత్యక్ష క్రికెట్ స్కోర్