చంటి ఛానల్,బోధన్: నిజామాబాద్ జిల్లా బోధన్ రాజకీయాల్లో కీలక పరిణామం చోటుచేసుకుంది. బీఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకుడు, మాజీ ఏఎంసీ చైర్మన్మ, ప్రముఖ న్యాయవాది వెంకటేశ్వర దేశాయ్ ఆ పార్టీకి రాజీనామా చేసి కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఈ రోజు ప్రభుత్వ సలహాదారు, బోధన్ ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి సమక్షంలో ఆయన కాంగ్రెస్ తీర్థం పుచ్చుకున్నారు. బీఆర్ఎస్ పార్టీలో నెలకొన్న నాయకత్వ లోపం, ఇతర అంతర్గత కారణాల దృష్ట్యా మనస్తాపం చెంది ఆయన పార్టీ మారినట్లు తెలుస్తోంది. సుదర్శన్ రెడ్డి ఆయనకు పార్టీ కండువా కప్పి సాదరంగా ఆహ్వానించారు.

