Explore

Search

November 7, 2026 6:21 pm

ప్రభుత్వ పాఠశాల అభివృద్ధికి లయన్స్ క్లబ్ రూ. 35 వేల విరాళం

చంటి ఛానల్,బోధన్: అచ్చన్‌పల్లి ప్రభుత్వ ప్రాథమికోన్నత పాఠశాల అభివృద్ధికి లయన్స్ క్లబ్ ఆఫ్ అచ్చన్‌పల్లి రూ. 35,000 విరాళం అందజేసింది. ఈ నిధులను పాఠశాల గోడలపై ఆకర్షణీయమైన పెయింటింగ్స్మ, ఇతర అభివృద్ధి పనుల కోసం వినియోగించనున్నారు. లయన్స్ క్లబ్ డైరెక్టర్ కె. సాంబిరెడ్డి, అధ్యక్షుడు ఎస్. కృష్ణమోహన్మ, ఇతర సభ్యులు ఈ నగదును ప్రధానోపాధ్యాయురాలు భారతికి అందజేశారు. ఈ సందర్భంగా విద్యార్థులకు పండ్లు, బిస్కెట్లు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో పలువురు క్లబ్ ప్రతినిధులు, స్థానిక ప్రముఖులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

ప్రకటన
ప్రత్యక్ష క్రికెట్ స్కోర్