Explore

Search

November 7, 2026 6:21 pm

బెల్లల్ అంగన్‌వాడీ పిల్లలకు యూనిఫామ్‌ల పంపిణీ

చంటి ఛానల్,బోధన్: బెల్లల్ గ్రామంలోని అంగన్‌వాడీ విద్యార్థులకు శనివారం ఘనంగా యూనిఫామ్‌లను పంపిణీ చేశారు. స్థానిక సర్పంచ్ రామావత్ రాజు ముఖ్య అతిథిగా హాజరై చిన్నారి విద్యార్థులకు దుస్తులను అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. విద్యార్థుల సంక్షేమానికి ప్రభుత్వం ప్రాధాన్యతనిస్తుందని, అంగన్‌వాడీ కేంద్రాలను ప్రతి ఒక్కరూ సద్వినియోగం చేసుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఉపసర్పంచ్ అన్నపూర్ణ గౌడ్, వార్డు మెంబర్లు సంక భాయ్, సతీష్, రూప్సింగ్, మల్లేష్, సంగీత, కవిత, ప్రసాద్‌తో పాటు ఐసీడీఎస్ సూపర్వైజర్ గోపి లక్ష్మి, కార్యదర్శి గంగాధర్, పాఠశాల ఉపాధ్యాయులు శిరీష, చంద్రకళ, సాయమ్మ, భారీ లింగం, ఆయమ్మలు లక్ష్మీ, ప్రతిభ తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

ప్రకటన
ప్రత్యక్ష క్రికెట్ స్కోర్