Explore

Search

November 7, 2026 6:44 pm

నిజాం షుగర్ ఫ్యాక్టరీ కార్మికుల నిరసన: రేపు గేటు ముందు ప్రెస్ మీట్

చంటి ఛానల్,బోధన్: ఆసియా ఖండంలోనే ప్రసిద్ధి చెందిన బోధన్ నిజాం షుగర్ ఫ్యాక్టరీని పునరుద్ధరించడంలో గత ప్రభుత్వం నిర్లక్ష్యం వహించగా, ప్రస్తుత ప్రభుత్వం కూడా అదే బాటలో నడుస్తోందని కార్మికులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఎన్నికల ముందు ఇచ్చిన హామీ ప్రకారం పెండింగ్ వేతనాలు చెల్లించి, ఫ్యాక్టరీని తెరిపించడంలో కాంగ్రెస్ ప్రభుత్వం విఫలమైందని, పది ఏళ్లుగా లే-ఆఫ్ పేరుతో తమ జీవితాలను అంధకారంలోకి నెట్టారని కార్మిక నాయకులు వాపోయారు. మూడు సంవత్సరాలుగా రిటైర్డ్ కార్మికులకు గ్రాడ్యుటీ అందడం లేదని, స్థానిక ఎమ్మెల్యే కూడా తమ సమస్యల పట్ల బాధ్యతారహితంగా వ్యవహరిస్తున్నారని వారు ఆవేదన వ్యక్తం చేశారు. ఈ నేపథ్యంలో తమ న్యాయమైన డిమాండ్లను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లేందుకు రేపు (జనవరి 23, 2026) ఉదయం 11 గంటలకు ఫ్యాక్టరీ గేటు ముందు ప్రెస్ మీట్ నిర్వహిస్తున్నట్లు కార్మిక నాయకులు ఉపేందర్, రవిశంకర్ గౌడ్, బాలకృష్ణ, శ్రీనివాస్, శ్రీధర్, భాస్కర్ తదితరులు ప్రకటించారు. పదేళ్లుగా జీతాల్లేక అలమటిస్తున్న కార్మికులకు విఆర్ఎస్ (VRS) లేదా ఎక్స్ గ్రేషియా ఇచ్చి సెటిల్మెంట్ చేయాలని, లేనిపక్షంలో పోరాటాన్ని ఉధృతం చేస్తామని వారు హెచ్చరించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

ప్రకటన
ప్రత్యక్ష క్రికెట్ స్కోర్