చంటి ఛానల్, బోధన్: పట్టణంలోని ప్రభుత్వ ఆసుపత్రి పక్కనే ఎటువంటి అనుమతులు లేకుండా నిర్వహిస్తున్న ‘కుమ్మన్‌పల్లి డి.ఎన్. రెడ్డి ఫస్ట్ ఎయిడ్ సెంటర్’ ను జిల్లా వైద్య ఆరోగ్య శాఖాధికారి (DMHO) డాక్టర్ రాజశ్రీ గురువారం ఆకస్మికంగా తనిఖీ చేసి సీజ్ చేశారు. అర్హత లేని వ్యక్తులు క్లినిక్ నిర్వహిస్తూ ప్రజల ప్రాణాలతో చెలగాటమాడుతున్నారని గుర్తించిన అధికారులు, నిబంధనలు అతిక్రమించే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ డీఎంహెచ్‌ఓ సమత, సీఐ వెంకటనారాయణ, నిర్మల, రవి, వేణు ఇతర అధికారులు పాల్గొన్నారు. ప్రజలు ఇటువంటి నకిలీ వైద్యుల వద్దకు వెళ్లి మోసపోవద్దని, కేవలం అర్హత గల డాక్టర్ల వద్దే చికిత్స తీసుకోవాలని అధికారులు ఈ సందర్భంగా సూచించారు.

