Explore

Search

November 7, 2026 6:21 pm

కరూర్ తొక్కిసలాట కేసు: సీబీఐ విచారణలో టీవీకే అధినేత విజయ్

గత ఏడాది సెప్టెంబరులో కరూర్‌లో జరిగిన బహిరంగ సభలో 41 మంది ప్రాణాలు కోల్పోయిన తొక్కిసలాట ఘటనపై సీబీఐ దర్యాప్తు ముమ్మరం చేసింది. ఈ కేసులో భాగంగా తమిళగ వెట్రి కజగం (TVK) అధ్యక్షుడు విజయ్‌ను ఢిల్లీలో సుమారు ఆరు గంటల పాటు అధికారులు సుదీర్ఘంగా విచారించారు. భద్రతా ఏర్పాట్లలో లోపాలు, సభ నిర్వహణలో వైఫల్యాల నేపథ్యంలో వచ్చే నెలలో దాఖలు చేయనున్న ఛార్జ్‌షీట్‌లో విజయ్‌ను నిందితుడిగా చేర్చే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం ఈ పరిణామం తమిళ రాజకీయాల్లో తీవ్ర చర్చకు దారితీస్తోంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

ప్రకటన
ప్రత్యక్ష క్రికెట్ స్కోర్