చంటి ఛానల్,సాలూర: హున్సా గ్రామంలో ‘జీవనదాన మహాకుంభ్’ కార్యక్రమంలో భాగంగా జగద్గురు శ్రీమద్ రామానందాచార్య నరేంద్ర స్వామి మహారాజ్ శిష్యుల ఆధ్వర్యంలో రక్తదాన శిబిరం అత్యంత ఘనంగా నిర్వహించబడింది. ఈ శిబిరంలో గ్రామ సర్పంచ్ మర్కల్ శివకుమార్ స్వయంగా రక్తదానం చేసి ఆదర్శంగా నిలవగా, సుమారు 100 నుండి 120 మంది యువకులు, స్వచ్ఛంద సేవకులు ఉత్సాహంగా పాల్గొని రక్తదానం చేశారు. ఈ సందర్భంగా బోధన్ మార్కెట్ కమిటీ చైర్మన్ చీల శంకర్, రామ్ గంగానగర్ సర్పంచ్ సాయినాథ్ తదితర ప్రముఖులు పాల్గొని రక్తదాతలను అభినందించారు. తలసేమియా, క్యాన్సర్ వంటి వ్యాధిగ్రస్తులను కాపాడేందుకు రక్తదానం ఎంతో దోహదపడుతుందని, “మీరు జీవించండి – ఇతరులను జీవింపజేయండి” అనే నినాదంతో నిర్వహించిన ఈ కార్యక్రమం గ్రామంలో గొప్ప సామాజిక చైతన్యాన్ని నింపిందని నిర్వాహకులు పేర్కొన్నారు.

