Explore

Search

November 7, 2026 6:44 pm

కమల దళంలో ప్రకంపనలు.. సీనియర్ నేతలు హస్తం గూటికి?

చంటి ఛానల్, బోధన్: మున్సిపల్ ఎన్నికల ముంగిట బోధన్ రాజకీయాల్లో పెను సంచలనం చోటుచేసుకోబోతుందా? దశాబ్దాలుగా బీజేపీ జెండాను భుజాన మోసి, పట్టణంలో పార్టీని బలోపేతం చేసిన సీనియర్ నాయకులు ఇప్పుడు కమలం పార్టీకి షాక్ ఇచ్చి కాంగ్రెస్‌లో చేరనున్నారా? అంటే అవుననే అనుమానాలు రాజకీయ వర్గాల్లో బలంగా వినిపిస్తున్నాయి. గత కొంతకాలంగా పార్టీ అధిష్టానం వ్యవహరిస్తున్న తీరు, తమ మనోభావాలను బేఖాతరు చేస్తుండటంతో తీవ్ర అసంతృప్తితో ఉన్న సీనియర్ నేతలు.. సామూహికంగా హస్తం గూటికి చేరేందుకు ముహూర్తం ఖరారు చేసుకున్నట్లు విశ్వసనీయ సమాచారం. ఈ స్థాయిలో సీనియర్ నాయకులే తిరుగుబాటు బావుటా ఎగురవేస్తే, రాబోయే మున్సిపల్ ఎన్నికల్లో బీజేపీకి మొండిచెయ్యి తప్పదా? అన్న ప్రశ్నలు ఇప్పుడు బోధన్ పట్టణంలో తీవ్ర చర్చకు దారితీస్తున్నాయి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

ప్రకటన
ప్రత్యక్ష క్రికెట్ స్కోర్