చంటి ఛానల్, బోధన్: మహారాష్ట్ర మహానగర పాలిక ఎన్నికల్లో బీజేపీ మహాయుతి కూటమి భారీ విజయం సాధించడంపై బోధన్ పట్టణ బీజేపీ శ్రేణులు హర్షం వ్యక్తం చేశాయి. ముంబై (BMC) తో పాటు 26 కార్పొరేషన్లలో బీజేపీ సత్తా చాటడంపై పట్టణ అధ్యక్షుడు పసులేటి గోపి కిషన్ నేతృత్వంలో అంబేద్కర్ చౌరస్తాలో టపాసులు పేల్చి, మిఠాయిలు పంచి సంబరాలు జరుపుకున్నారు. ఈ కార్యక్రమంలో నాయకులు కొలిపాక బాలరాజు, గొడుగు ధర్మపురి, గుంత గంగాధర్, పవన్ కుమార్, గౌతమ్ గౌడ్, వేణు, వాసు, శ్రీకాంత్, అనిల్, భూమయ్య, లింగం, ఫణి తదితరులు పాల్గొన్నారు.

