Explore

Search

November 7, 2026 6:21 pm

​డ్రోన్ కెమెరాల నిఘాలో కోడి పందాలు, జూద కేంద్రాలు

చంటి ఛానల్, నిజామాబాద్:  పోలీస్ కమిషనర్ శ్రీ పి. సాయి చైతన్య ఆదేశాల మేరకు వర్ని, కోటగిరి పోలీస్ స్టేషన్ల పరిధిలోని జలాల్‌పూర్, కోటయ్య క్యాంప్, శ్రీనగర్, జాకోరా వంటి గ్రామాల్లో పోలీసులు డ్రోన్ కెమెరాల ద్వారా ముమ్మర నిఘా చేపట్టారు. సంక్రాంతి పండుగ వేళ అక్రమంగా నిర్వహించే కోడి పందాలు, జూద కార్యకలాపాలను అరికట్టడమే లక్ష్యంగా ఈ తనిఖీలు నిర్వహిస్తున్నట్లు వర్ని ఎస్‌ఐ తెలిపారు. డ్రోన్ల వినియోగంతో నిందితుల్లో భయం మొదలైందని, ఇప్పటికే పలుచోట్ల ఈ అక్రమ క్రీడలు నిలిచిపోయాయని పోలీసులు వెల్లడించారు. చట్ట వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడితే కఠిన చర్యలు తప్పవని హెచ్చరిస్తూ, ప్రజలు ఏదైనా సమాచారం ఉంటే వెంటనే డయల్ 100కు సమాచారం అందించాలని కోరారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

ప్రకటన
ప్రత్యక్ష క్రికెట్ స్కోర్