Explore

Search

November 7, 2026 6:31 pm

మున్సిపాలిటీ వార్డుల రిజర్వేషన్లు ఖరారు: 38 వార్డుల పూర్తి వివరాలు

చంటి ఛానల్,​బోధన్: మున్సిపాలిటీలోని మొత్తం 38 వార్డులకు సంబంధించిన రిజర్వేషన్లను అధికారులు అధికారికంగా ఖరారు చేశారు. ఈ విభజనలో భాగంగా ఎస్టీలకు 1 వార్డు (జనరల్), ఎస్సీలకు 3 వార్డులు (2 జనరల్, 1 మహిళ) కేటాయించారు. బీసీ సామాజిక వర్గానికి అత్యధికంగా 15 వార్డులు దక్కగా, అందులో 8 జనరల్, 7 మహిళలకు కేటాయించబడ్డాయి. వీటితో పాటు 11 వార్డులను జనరల్ మహిళలకు రిజర్వ్ చేయగా, మిగిలిన 8 వార్డులను అన్-రిజర్వ్‌డ్ (ఓపెన్ కేటగిరీ) గా ప్రకటించారు. రిజర్వేషన్ల ప్రక్రియ పూర్తి కావడంతో బోధన్ రాజకీయాల్లో అభ్యర్థుల ఎంపికపై కసరత్తు మొదలైంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

ప్రకటన
ప్రత్యక్ష క్రికెట్ స్కోర్