చంటి ఛానల్, బోధన్: స్థానిక శ్రీ చక్రేశ్వర శివ మందిరంలో ఈనెల 16 నుండి 18 వరకు శ్రీ చక్రేశ్వర స్వామి వారి 67వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు అత్యంత వైభవంగా నిర్వహించనున్నట్లు ఆలయ ఈవో రాములు ఒక ప్రకటనలో తెలిపారు. ఈ వేడుకలలో భాగంగా ఈనెల 18వ తేదీన స్వామివారి జన్మదినోత్సవాన్ని పురస్కరించుకుని ప్రత్యేక పూజలు, అభిషేకాలు వైభవంగా నిర్వహించనున్నారు. మూడు రోజుల పాటు జరిగే ఈ ఆధ్యాత్మిక కార్యక్రమాలకు భక్తులు అధిక సంఖ్యలో తరలివచ్చి, స్వామివారిని దర్శించుకుని తీర్థప్రసాదాలు స్వీకరించి స్వామివారి కృపకు పాత్రులు కావాలని ఆయన కోరారు.

