Explore

Search

November 7, 2026 6:21 pm

​”కన్నీటి పర్యంతం: అప్పుల బాధతో 18 ఏళ్ల యువకుడు బలి!”

చంటి ఛానల్,నిజామాబాద్: రెంజల్ మండలం కూనేపల్లి గ్రామంలో తీవ్ర విషాదం నెలకొంది. అప్పుల భారం తీర్చలేక, మనస్తాపానికి గురైన 18 ఏళ్ల యువకుడు సంజయ్ తన ఇంట్లోనే ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. చేతికి వచ్చిన కొడుకు కళ్లముందే విగతజీవిగా పడి ఉండటంతో తల్లిదండ్రులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు. ఈ ఘటనతో గ్రామంలో విషాద ఛాయలు అలముకోగా, సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని కేసు నమోదు చేశారు. అనంతరం మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం బోధన్ జిల్లా ఆసుపత్రికి తరలించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

ప్రకటన
ప్రత్యక్ష క్రికెట్ స్కోర్