Explore

Search

November 7, 2026 6:31 pm

చంటి ఛానల్ ఎఫెక్ట్ : నాగన్‌పల్లి హైవేపై సాఫీగా ప్రయాణం!

​నిజామాబాద్: బోధన్ మండలం నాగన్‌పల్లి వద్ద NH-63 హైవే బ్రిడ్జి రోడ్డు పరిస్థితి మరీ అద్వానంగా తయారైన వైనంపై ‘చంటి ఛానెల్’ ప్రచురించిన వార్తకు అధికారుల నుండి సానుకూల స్పందన లభించింది. రోడ్డు ప్రమాదకరంగా ఉన్న విషయాన్ని మేము వెలుగులోకి తీసుకువచ్చిన వెంటనే స్పందించిన అధికారులు, గత రెండు మూడు రోజులుగా పనులు చేపట్టి బ్రిడ్జికి ఇరువైపులా డ్యామేజ్ అయిన రోడ్డును బాగు చేయించారు. దీంతో ఈ మార్గంలో ప్రయాణించే వాహనదారుల ఇబ్బందులు తొలగిపోయాయి. తమ సమస్యను గుర్తించి అధికారుల దృష్టికి తీసుకెళ్లిన చంటి ఛానెల్‌కు,తక్షణమే స్పందించి రోడ్డును బాగు చేసిన అధికారులకు ప్రయాణికులు ఈ సందర్భంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

ప్రకటన
ప్రత్యక్ష క్రికెట్ స్కోర్